Site icon HashtagU Telugu

Russo Btothers: ధనుష్ కోసం ఇండియా వస్తున్న రూసో బ్రదర్స్

Russo Brothers

Russo Brothers

ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’. జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో ఫేమస్. హాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలు తీశారు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందించిన ‘ది గ్రే మ్యాన్’ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ ”హాయ్! మేం రూపొందించిన కొత్త సినిమా ‘ది గ్రే మ్యాన్’ ప్రదర్శనకు, మా స్నేహితుడు ధనుష్ ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం” అని అన్నారు. ‘ది గ్రే మ్యాన్’ సినిమా గురించి ధనుష్ మాట్లాడుతూ ”ఈ సినిమా జర్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్. యాక్షన్, డ్రామా, ఓ పెద్ద చేజ్… సినిమాలో అన్నీ ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి చేసిన ‘ది గ్రే మ్యాన్’లో మంచి పాత్ర పోషించడం నాకు సంతోషంగా ఉంది” అని అన్నారు. మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూసో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందించారు. సినిమాకు తగ్గట్టుగా జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీల్ స్క్రిప్ట్ రాశారు

Exit mobile version