పుష్ప 2 (Pushpa 2)తో భారీ హిట్ అందుకున్న నేషనల్ బ్యూటీ రష్మిక(Rashmika)..త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend ) సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రష్మిక, దీక్షిత్ శెట్టి (Rashmika Mandanna – Dheekshith Shetty) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. హేశమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి గతంలోనే ఫస్ట్ లుక్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్ ను సోమవారం రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)వాయిస్ ఇచ్చాడు. ఈ టీజర్ ప్రారంభం కాగానే.. ‘నయనం నయనం కలిసే తరుణం.. యదనం తరిగి పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇక మీదట నువ్వే దానికి గమ్యం.. విసిరి నవ్వుల్లో వెలుగులు చూసా.. నీ నవ్వు ఆపితే చీకటి పగులును తెలుసా.. నీకై మనసును రాసి చేశా.. పడ్డానేమో ప్రేమల బహుశా.. అంటూ విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్ ను తన గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందాన సినిమా గర్ల్ ఫ్రెండ్ కోసం ఇచ్చేశాడు. లాస్ట్ లో ‘ఇదేదో పికప్ లైన్ కాదు కదా’ అంటూ రష్మిక మందాన క్యూట్ డైలాగ్ వేస్తుంది. ఓవరాల్ గా ఓ ప్రేమ కవితతో ఈ టీజర్ సాగింది. రష్మిక మందన్న ఓ కాలేజీలో జాయిన్ అవ్వడం, కాలేజీ హాస్టల్ లో జాయిన్ అవ్వడం, ఒక అబ్బాయితో ప్రేమలో పడటం, ఆ ప్రేమలో బాధలు ఉండటం.. టీజర్లో చూపించారు. ఈ టీజర్ చూస్తుంటే ఒక అమ్మాయి కోణంలో సాగే లవ్ స్టోరీ సినిమా అని తెలుస్తుంది.
ఇక అల్లు అర్జున్- రష్మిక మందాన జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా గత రికార్డులను బ్రేక్ చేసి నయా రికార్డులను సృష్టిస్తుంది. కేవలం 4రోజుల్లోనే 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఎంత క్రేజ్ వచ్చిందో హీరోయిన్ రష్మిక మందానాకు కూడా అంతే క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాతో రష్మిక మందాన పాపులాటి మరింత పెరిగింది.
Read Also : Manchu Manoj Medical Report : వెన్నెముకకు తీవ్ర గాయాలు