సమంత మరోసారి చైతు పై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. సమంత (Samantha), బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ (Varun Dhavan) కాంబినేషన్లో వచ్చిన ‘సిటాడెల్: హనీ-బన్నీ’ (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్లో పాల్గొన్న సామ్.. ఖరీదైన గిఫ్ట్ ను ఎవరికైనా ఇచ్చిన తర్వాత… ఆ గిఫ్ట్ వేస్ట్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా? అని వరుణ్ అడుగగా.. ‘నా ఎక్స్ (మాజీ భర్త)కు ఇచ్చిన బహుమతి’ అని సమంత రిప్లయ్ ఇచ్చింది.
ఏమాయ చేసావే తో జోడి కట్టిన నాగ చైతన్య – సమంత (Naga Chaitanya and Samantha)లు నిజ జీవితంలో కూడా జోడి కట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమా తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ కొన్నేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కారు. వీరి జంట చూసి ఎన్ని జంటలు కుల్లుకున్నాయో..ఎంతమంది ఈర్ష పడ్డారో తెలియంది కాదు..అక్కినేని వంటి పెద్ద ఫ్యామిలీ లో సమంత అడుగుపెట్టడం ఆమె అదృష్టమని అంత మాట్లాడుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో పలు గొడవలు జరిగి..చివరకు విడాకులు (Divorce ) తీసుకునే వరకు వచ్చింది. ఇద్దరు కూడా ఇష్టంగా విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపి..ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ప్రస్తుతం చైతు రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. నటి శోభితను వివాహం చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 04 న అన్నపూర్ణ స్టూడియో లో వివాహం జరగనుంది. ఇక సామ్ మాత్రం తాను ఎప్పటికి సింగిల్ గానే ఉంటానని చెప్పుకొస్తుంది.
Read Also : JEE 2025 : ముగిసిన జేఈఈ దరఖాస్తు గడువు.. 13.8 లక్షల అప్లికేషన్లు