Site icon HashtagU Telugu

The General : సైలెంట్ ఫిలిం హిస్టరీలోనే.. అత్యంత ఖరీదైన సీన్ అదే.. వందేళ్ల క్రితమే..

The General Movie highest cost film in Silent Film History

The General Movie highest cost film in Silent Film History

The General : ఇప్పుడంటే డైలాగ్స్ చెప్పి సీన్స్ లో ఎమోషన్స్ పండిస్తున్నారు. కానీ ఒకప్పుడు సైలెంట్ ఫిలింస్ (మూకీ సినిమాలు) తోనే ప్రేక్షకులను ఎమోషనల్ చేసేవారు. 1890 మధ్య కాలం నుంచి 1920 మధ్య కాలం వరకు ఈ సైలెంట్ ఫిలింస్ హవానే నడిచింది. కానీ ఆ తరువాత సౌండ్ టెక్నాలజీలో కొత్త మార్పులు రావడంతో.. టాకీ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కాగా సైలెంట్ ఫిలింస్ చరిత్రలో కూడా భారీ సినిమాలను తెరకెక్కించారు.

అలా తెరకెక్కించిన సినిమాల్లో అత్యంత ఖరీదైన సినిమా అంటే ‘ది జనరల్’. 1926లో రూపొందిన ఈ సినిమాలోని కొన్ని సెకన్ల షాట్ కోసం లక్షలు ఖర్చు చేసారు. ‘బస్టర్ కీటన్’ (Buster Keaton) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందింది. అమెరికన్ సివిల్ వార్ సమయంలో జరిగే ఈ కథ లోకోమోటివ్ (Train Locomotive) సర్వీస్ చుట్టూ తిరుగుతుంది. కాగా ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ట్రైన్ బ్రిడ్జిపై వెళ్తుంటే.. బ్రిడ్జి కూలిపోయి నదిలో పడిపోతుంది.

ఇక ఈ సీన్ తెరకెక్కించడం కోసం మేకర్స్ నిజమైన లోకోమోటివ్ ని ఉపయోగించారు. నిజమైన ట్రైన్, బ్రిడ్జిని నిర్మించి ఆ సీన్ ని తెరకెక్కించారు. కేవలం కొన్ని సెకెన్ల ఈ షాట్ కోసం మేకర్స్.. దాదాపు ఆ రోజుల్లోనే 100 ఏళ్ళ క్రితమే $50,000 డాలర్స్ ని ఖర్చు చేశారట. అంటే ఇండియన్ కరెన్సీలో ఇప్పటి ప్రకారం అక్షరాలా 41 లక్షల పైనే. సైలెంట్ ఫిలిం హిస్టరీలోనే ఇది అత్యంత ఖరీదైన సీన్. ఈ సీన్ ని చిత్రీకరించిన తరువాత నదిలో పడిపోయిన ఆ లోకోమోటివ్ ని అలాగే వదిలేసారు.

దాదాపు 20ఏళ్ళ పాటు ఆ లోకోమోటివ్ ఆ నదిలో ఉండిపోయింది. దీంతో అది ఒక చిన్న టూరిస్ట్ స్పాట్ లా మారిపోయింది. అయితే సెకండ్ వరల్డ్ వార్ సమయంలో స్క్రాప్ కోసం ఆ లోకోమోటివ్ ని నదిలో నుంచి తీసి.. యుద్ధం కోసం వాడుకున్నారు. కాగా ఈ సినిమా రూపొందించడానికి ఆ రోజుల్లోనే 6 కోట్లకు పైగా ఖర్చు చేసారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 8 కోట్లకు పైగా రాబట్టింది.

 

Also Read : Kona Venkat : ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తానంటున్న రైటర్ కోన వెంకట్