Das Ka Dhamki: మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ సింగిల్!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Das Ka Dhamki

Das Ka Dhamki

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’  (Das Ka Dhamki) టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన ‘దాస్ కా ధమ్కీ’ థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్‌ లను ప్రారంభించారు. హిందీ వెర్షన్ ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాటను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లోషూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విశ్వక్ సేన్ (Vishwak Sen) స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌ లు, నివేదా పేతురాజ్ గ్లామ్ టచ్ థియేటర్‌ లలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. . లియోన్ జేమ్స్ , ఆదిత్య ఆర్కే లైవ్లీగా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది. హిందీ వెర్షన్‌కి అమితాబ్ వర్మ సాహిత్యం అందించగా, లియోన్ జేమ్స్‌తో కలిసి నకాష్ అజీజ్ ఆలపించారు.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki) ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: RGV with Ashu Reddy: దటీజ్ వర్మ.. ఆశురెడ్డి కాళ్లకు ముద్దు పెట్టి, మసాజ్ చేసి!

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: విశ్వక్ సేన్

నిర్మాత: కరాటే రాజు

బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్

డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ

డీవోపీ: దినేష్ కె బాబు

సంగీతం: లియోన్ జేమ్స్

ఎడిటర్: అన్వర్ అలీ

ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు

ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్

  Last Updated: 07 Dec 2022, 02:53 PM IST