Site icon HashtagU Telugu

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ‘గుడ్ లక్ జెర్రీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Jahnavi1

Jahnavi1

బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సవాలు చేసే పాత్రలతో నటిచేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న ‘గుడ్ జెర్రీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం జాన్వీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. తొలి పోస్టర్‌లో తుపాకీ పట్టుకుని భయంకరంగా కనిపించింది. ముక్కు కు ఉంగరంతో చెమట చొక్కా ధరించింది. చీకటి, మండుతున్న నేపథ్యం కూడా పోస్టర్‌ను లో చూడొచ్చు. సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆనంద్ ఎల్ రాయ్ మరియు సుభాస్కరన్ అల్లిరాజా బ్యాంక్రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, మీటా వశిష్ఠ్, నీరజ్ సూద్,  సుశాంత్ సింగ్ ఇతర ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.