ఈ ఏడాది ఇండియా నుంచి ఆస్కార్‌కి వెళ్లిన గుజరాతీ సినిమా చెలో షో అంటే లాస్ట్ ఫిల్మ్ షో బాల నటుడు రాహుల్ కోలీ క్యాన్సర్ తో కన్నుమూశారు. రాహుల్ లుకేమియా అనే క్యాన్సర్ తో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. ఈ చిత్రంలో భవిన్ రాబరి ప్రధాన పాత్ర పోషించగా, రాహుల్ అతని స్నేహితుడి పాత్రలో నటించారు. బాల నటుడు రాహుల్ కోలి 15ఏళ్ల వయస్సులోనే మరణించడం చిత్ర సీమను తీవ్రంగా కలచివేసింది. 95వ ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్ర విభాగం ప్రవేశం పొందిన ఛెల్లో షోలో రాహుల్ భాగం అయ్యాడు. దివంగత బాలనటుడు మరణించడానికి కొన్ని రోజుల ముందు తీవ్ర జ్వరం, రక్తపు వాంతులు చేసుకున్నట్లు ఆయన తండ్రి చెప్పారు. రాహుల్ అంత్యక్రియలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఈ మూవీ చూస్తామని తెలిపారు. ఈ సినిమా అక్టోబర్ 14న రిలీజ్ అవుతుంది.