Sundeep Kishan: ఆ సినిమా చూసి చాలా అప్సెట్ అయ్యాను.. సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఊరి పేరు బైరవకోన. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుద

Published By: HashtagU Telugu Desk
Mixcollage 09 Feb 2024 07 56 Am 9211

Mixcollage 09 Feb 2024 07 56 Am 9211

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఊరి పేరు బైరవకోన. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సందీప్ కిషన్ తన సినిమా అయిన మైకేల్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా రంజిత్ జయకోడి డైరెక్షన్‌ లో గత ఏడాది ఫిబ్రవరి 3న మైఖేల్ సినిమా రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్ వంటి స్టార్స్ నటించారు.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. తాజాగా ఈ సినిమాపై సందీప్ కిషన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. మైఖేల్ సినిమా గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీ విడుదల అయింది. ఈ సినిమా చాలా డిజప్పాయింట్ చేసింది. నాకు ఆ అసలు నచ్చలేదు. ఈ సినిమాను ఇద్దరు ప్రొడ్యూసర్లు నమ్మారు. కానీ ఒక ప్రొడ్యూసర్ మాత్రం అనుమానపడుతూనే ఉన్నారు. రిలీజ్ కి 12 రోజుల ముందు సినిమా రీ చెక్ చేయడానికి నేను భయపడ్డాను. సినిమా ముందు రోజు రాత్రి చూసిన తర్వాత నేను చాలా అప్‌సెట్ అయ్యాను.

టెక్నికల్‌ గా ఎక్ట్రార్డినరీ సినిమా అయినా కూడా అనుకున్నట్లుగా కథ ల్యాండ్ అవ్వలేదు. ఈ సినిమా పోతే నెక్ట్స్ ఏంటనుకునే రకాన్ని కాదు. మైఖేల్ సినిమా అపజయాన్ని పర్సనల్‌గా తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు సందీప్ కిషన్. ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఊరి పేరు భైరవకోన సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఈరోజే అనగా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ఈరోజు రవితేజ నటించిన ఈగల్ సినిమా విడుదల అవుతుండడంతో సినిమాను ఫిబ్రవరి 16వ తేదీకి వాయిదా వేశారు.

  Last Updated: 09 Feb 2024, 07:57 AM IST