Prakash Raj : ప్రకాశ్ రాజ్.. అద్భుత నటుడు. ఆయన కల్మషం లేని మంచి మనిషి కూడా. రాజకీయాలపై అయినా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలపై అయినా నిర్భయంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రకాశ్ రాజ్ నైజం. అందుకే ఈతరంలోని ఇతర నటుల కంటే ఆయన సెపరేటు. రాజకీయాల గురించి మాట్లాడటం వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయినా.. ఆయన వెనుకంజ వేయడం లేదు. ధైర్యంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గళం విప్పుతున్నారు. స్వతంత్రత, స్వేచ్ఛ తన వ్యక్తిత్వపు నైజం అని చాటుకుంటున్నారు. ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పేరెంట్స్ గురించి ఆసక్తికర వివరాలను ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం..
Also Read :Met Gala 2025 : ‘మెట్ గాలా’కు ఏడుగురు భారతీయులు.. ఏమిటిది ? షాకింగ్ రూల్స్ !
ప్రకాశ్ రాజ్ తల్లి గురించి..
‘‘మా అమ్మ స్వర్ణలత రాజ్ తన బాల్యంలో చాలా బాధలను అనుభవించింది. ఎన్నో కష్టాలను ఆమె చూసింది. మా అమ్మ 12 సంవత్సరాల వయసులో అనాథగా మిగిలింది. మా అమ్మమ్మ చనిపోయిన సమయానికి.. మా తాతయ్య చాలా పేదరికంలో ఉన్నారు. దీంతో మా తాతయ్య కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మా అమ్మను, ఆమె ఇద్దరు సోదరీమణులను తీసుకెళ్లి ఒక అనాథాశ్రమంలో చేర్పించారు. మా అమ్మ, ఆమె సోదరీమణులు అక్కడే పెరిగారు. ఆ అనాథాశ్రమాన్ని ఒక క్రైస్తవ మిషనరీ నడిపేది. దీనివల్ల మా అమ్మ కూడా క్రైస్తవ మతంలోకి మారిపోయింది. ఆ తర్వాత మా అమ్మకు ఒక ఆస్పత్రిలో నర్సుగా జాబ్ వచ్చింది. కొంతకాలం తర్వాత మా అమ్మ బెంగళూరుకు షిఫ్ట్ అయింది. మా అమ్మ దగ్గర డబ్బులు లేకున్నా.. జీవితంలోని సవాళ్లను చాలా ధైర్యంగా ఎదుర్కొంది’’ అని ప్రకాశ్ రాజ్ వివరించారు.
ప్రకాశ్ రాజ్ తండ్రి గురించి..
‘‘మా నాన్న మంజునాథ్ రాయ్ చదువుకోవడం ఇష్టంలేక మంగళూరు వదిలి బెంగళూరుకు(Prakash Raj) వచ్చారు. ఆయన అక్కడ బుక్ బైండింగ్ పని చేసేవారు. బెంగళూరులోనే మా అమ్మ నర్సుగా పనిచేసేది. ఆమె పనిచేసే ఆస్పత్రికి ఒకసారి మా నాన్న వెళ్లారు. అక్కడే వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది. మా అమ్మానాన్న ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అప్పుడు నేను పుట్టాను. నా బాల్యమంతా పోరాటంలోనే గడిచింది. బాల్యంలో నేను ఎప్పుడైనా పెద్ద విషయం చూశానంటే.. అది సైకిల్’’ అని చెప్పుకొని ప్రకాశ్ రాజ్ భావోద్వేగానికి గురయ్యారు.
Also Read :Mughals Vs Red Fort: ఎర్రకోట తమదేనంటూ మొఘల్ వారసురాలి పిటిషన్.. ఏమైందంటే ?
మా అమ్మ సర్జరీ తర్వాత.. మమ్మల్ని మర్చిపోయింది..
‘‘మా అమ్మకు మెదడులో ఒక తిత్తి ఉండేది. ఆ తిత్తిని తీయించేందుకు మా అమ్మకు సర్జరీ చేయించాను. సర్జరీ జరిగిన మూడు రోజుల తర్వాత మా అమ్మ మమ్మల్ని మర్చిపోయింది. మా అమ్మ మమ్మల్ని మర్చిపోయిన సందర్భాన్ని తలుచుకుంటే ఇప్పటికీ చాలా బాధేస్తుంది. మా అమ్మకు పాత రోజులను గుర్తుకు తెచ్చేందుకు.. నేను ఆమె స్కూల్ ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చే వాడిని. మా అమ్మకు మళ్లీ మెమోరీ తిరిగొస్తుందనే చిన్న ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేసే వాడిని. మా అమ్మ చనిపోయి చాలా ఏళ్లయింది. ఇప్పుడు ఆమె మా మధ్యలో లేదు. అయినా మా అమ్మను గుర్తు చేసుకుంటూనే ఉంటాను’’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.