Divi Vadthya: బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్స్ పెట్టుకోకపోవడానికి కారణం అదే.. దివి కామెంట్స్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 10:15 AM IST

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకొంది. అలాగే బిగ్బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల కాలంలో మూవీలో అవకాశాల కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు. అయితే బిగ్ బాస్ షోకి వచ్చే వరకు దివి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

మంచి హైట్, స్లిమ్ బాడీతో దివి చాలా అందంగా ఉండేది. తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దివి స్కిన్ షోకి, ఎఫైర్స్ కి దూరంగా ఉంది. అలాగే చాలా వరకు కామ్ గా ఉండేది. గొడవలు పడేది కాదు. సీజన్ 4లో అభిజిత్, అఖిల్ సార్థక్, సోహైల్, మెహబూబ్ వంటి హ్యాండ్సమ్ బాయ్స్ కంటెస్ట్ చేశారు. కానీ దివి ఎవరి పట్ల ఆసక్తి చూపలేదు. మోనాల్, అలేఖ్య హారిక మాత్రం హౌస్లో అఫైర్స్ నడిపారు. అమ్మ రాజశేఖర్ తో దివి స్నేహం చేసింది. ఆయనతోనే ఎక్కువగా మాట్లాడేది. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్లో ఎఫైర్స్ పెట్టుకోకపోవడానికి దివి కారణాలు తాజాగా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు వెళ్ళకూడదు అనుకున్నాను. బిగ్ బాస్ షోకి వెళితే కెరీర్ నాశనం అవుతుంది. ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ కూడా ఆ షో తర్వాత రావేమో అని భావించాను.

చాలా మందిని సలహా అడిగి బిగ్ బాస్ షోకి వెళ్ళాను. బిగ్ బాస్ హౌస్ నుండి నేను పాజిటివ్ ఇమేజ్ తో బయటకు రావాలి అనుకున్నాను. అందుకే అఫైర్స్ పెట్టుకోలేదు. బాయ్ ఫ్రెండ్ లేకుండా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన అమ్మాయిని నేను మాత్రమే. బిగ్ బాస్ షో నుండి వచ్చాక కూడా కొన్ని ఆఫర్స్ చేజారాయి. చిత్ర పరిశ్రమలో అస్థిరత్వం ఎక్కువ. ఒక ప్రాజెక్ట్ చేసే వరకు ఆఫర్ మనది అనుకోవడానికి వీల్లేదు. మనం చేయాల్సిన పాత్ర ఎవరికైనా దక్కవచ్చు. వచ్చిన ఆఫర్ కోల్పోకుండా మేకర్స్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. అణిగిమణిగి ఉండాలి అని అన్నారు. దివికి రవితేజ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చి చేజారిందట. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత లేదని ఆమె వాపోయింది. గతంతో పోల్చుకుంటే దివికి బిగ్ బాస్ షో తర్వాత ఆఫర్స్ పెరిగాయి. గాడ్ ఫాదర్, జిన్నా, రుద్రంగి వంటి చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేసింది. అలాగే కొన్ని వెబ్ సిరీస్లలో నటించింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన లంబసింగి ఇటీవల విడుదలైంది. నెక్స్ట్ దివి పుష్ప 2 చిత్రంలో రిపోర్టర్ రోల్ చేస్తోందట.