జన నాయకుడు మూవీ ఎఫెక్ట్‌తో మ‌ళ్లీ ట్రెండింగ్‌లోకి భ‌గ‌వంత్ కేసరి..

Bhagavanth Kesari Trends on OTT After Jana Nayagan తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) సంక్రాంతికి వస్తోంది. ఇది బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని ట్రైలర్ తో స్పష్టమైంది. దీంతో ‘భగవంత్ కేసరి’ ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చి, తమిళ ప్రేక్షకులు కూడా చూసేస్తున్నారు. మరోవైపు ‘జన నాయకుడు’ ట్రైలర్ పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు తమిళ హీరో విజయ్‌ కెరీర్ లో ఆఖరి సినిమా ‘జన […]

Published By: HashtagU Telugu Desk
Bhagavanth Kesari Trends on OTT After Jana Nayagan

Bhagavanth Kesari Trends on OTT After Jana Nayagan

Bhagavanth Kesari Trends on OTT After Jana Nayagan తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) సంక్రాంతికి వస్తోంది. ఇది బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని ట్రైలర్ తో స్పష్టమైంది. దీంతో ‘భగవంత్ కేసరి’ ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చి, తమిళ ప్రేక్షకులు కూడా చూసేస్తున్నారు. మరోవైపు ‘జన నాయకుడు’ ట్రైలర్ పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు

తమిళ హీరో విజయ్‌ కెరీర్ లో ఆఖరి సినిమా ‘జన నాయగన్‌’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగులో ‘ జన నాయకుడు ‘ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ లాస్ట్ సినిమా కావడంతో, అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడీ సినిమా కారణంగా ‘భగవంత్‌ కేసరి’ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన సినిమా ‘భగవంత్‌ కేసరి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. అయితే ఇదే సినిమాకి రీమేక్ గా ‘జన నాయకుడు’ రూపొందుతోందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. అనిల్ రావిపూడి కథతోనే విజయ్ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

భగవంత్‌ కేసరి’ స్టోరీ లైన్ తీసుకోవడంతో పాటుగా ‘జన నాయకుడు’ ట్రైలర్ లో సీన్ టు సీన్ కాపీ చేశారని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అలానే ఏఐ షాట్స్ వాడారంటూ విమర్శిస్తున్నారు. మరోవైపు ‘భగవంత్‌ కేసరి’ సంగతేంటో తెలుసుకోవాలని.. తమిళ తంబీలు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఓటీటీలో బాలయ్య సినిమాని చూసేస్తున్నారు. దీంతో ఉన్నట్టుండి భగవంత్‌ కేసరి మూవీ దెబ్బకి టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

భగవంత్‌ కేసరి సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటుగా తమిళంలోనూ అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ అవసరం కూడా లేదు కాబట్టి, నేరుగా తమిళంలోనే ఈ చిత్రాన్ని చూస్తున్నారు. దీంతో బాలకృష్ణ సినిమా రెండేళ్ల తర్వాత ఓటీటీలో ట్రెండింగ్‌ చార్ట్స్ లో టాప్‌-1లోకి వచ్చేసింది. మరోవైపు ‘భగవంత్‌ కేసరి’ హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

జన నాయకుడు’ ట్రైలర్ పై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ”ఇదీ మన బాలయ్య సౌండూ.. ఎట్లా ఉంది శుక్లా జీ?” అంటూ ‘భగవంత్‌ కేసరి’ సినిమాకి సంబంధించిన వీడియోని జియో హాట్ స్టార్ ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీన్ని బట్టే బాలయ్య సినిమా గురించి నెట్టింట ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయనేది అర్థమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే, ‘జన నాయకుడు’ రిలీజైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో!

 

  Last Updated: 05 Jan 2026, 04:59 PM IST