విక్రమ్ (Vikram) కథానాయకుడిగా పా.రంజిత్ దర్శకత్వంలో (Thangalaan) ‘తంగలాన్’. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాళవిక మోహనన్ కథానాయిక. హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా మేకింగ్ విజువల్ పోస్టర్ (Poster) ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. విక్రమ్ తన భూమిని అణచివేతదారుల నుండి రక్షించడానికి బయలుదేరిన నాయకుడి లా కనిపించాడు.
యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం (Thangalaan) కోసం విక్రమ్ చాలా కష్టపడినట్లు వీడియో ను చూస్తే అర్ధం అవుతుంది. వీడియో లోని విజువల్స్ చాలా అద్బుతం గా ఉన్నాయి. జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది. ఈ చిత్రం లో పార్వతి, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Indian Celebrities: రష్మిక క్రేజ్ మాములుగా లేదు.. సెలబ్రిటీస్ లిస్ట్‌లో నేషనల్ క్రష్!