Site icon HashtagU Telugu

Thandel : తండేల్ టాక్ ఎలా ఉందంటే..!!

Thandel Talk

Thandel Talk

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)..ప్రస్తుతం ఆశలన్నీ తన 23 వ చిత్రం తండేల్ (Thandel ) పైనే పెట్టుకున్నాడు. సవ్యసాచి , ప్రేమమ్ చిత్రాల డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో చైతూకు జోడిగా సాయి పల్లవి నటిస్తుండగా… గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్ వీక్ సందర్భంగా ఈరోజు ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా నుండి ప్రతి సాంగ్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేయడంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి అందరిలో పెరిగింది. మరి ఆ ఆసక్తి తగ్గట్లే సినిమా ఉందా..? చైతు ఎలా చేసాడు..? సాయి పల్లవి తన యాక్టింగ్ తో మరోసారి మాయ చేసిందా..? చందు డైరెక్షన్ ఎలా ఉంది..? అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.

RGV : రేపు పోలీసుల విచారణకు హాజరుకానున్న వర్మ..!

తండేల్ మూవీ ప్రీమియర్స్ ప్రపంచవ్యాప్తంగా ముగిశాయి. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. ఈ మూవీలో సాయిపల్లవి, నాగచైతన్య ఫెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. చందూ మొండేటి డైరెక్షన్ బాగుంది. సెకండాఫ్‌లో పాకిస్థాన్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి అని చెపుతున్నారు. తండేల్ సినిమాలో కీలక పాత్రలు రాజు, సత్య. రాజుగా నాగచైతన్య, సత్యగా సాయిపల్లవి నటించారు. ఈ సినిమా సత్య, రాజుల ప్రేమ కథ. వారిద్దరి మధ్య జరిగిన బలమైన ప్రేమ కథ ఈ సినిమాకు పునాది. పాకిస్థాన్ జైలు, ఇతర ఎమోషనల్ అంశాలు వీరి పాత్రల చుట్టూ అల్లుకున్నాయని అంటున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది.. సెకండాఫ్ అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్యను చూసి అంతా సర్ ప్రైజ్ అవుతారని.. అంతలా అద్భుతంగా నటించేశాడని అంటున్నారు.