Site icon HashtagU Telugu

Thandel: రేపు తండేల్ సినిమా స‌క్సెస్ మీట్‌.. ప్లేస్ ఎక్క‌డంటే?

Thandel

Thandel

Thandel: తండేల్ (Thandel) సినిమా సక్సెస్ మీట్ ఈ నెల 13న గురువారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని చిత్ర నిర్మాత బన్నివాసు కోరారు. చిత్రాన్ని విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. థియేటర్లలో హౌస్‌ఫుల్ కనెక్షన్లుతో కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులకు జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా చిత్రాన్ని నిర్మించినందుకు, అందుకు సహకరించిన వారికి వాసు ధన్యవాదాలు తెలిపారు.

విజయోత్సవ సభకు సినీ నిర్మాత అల్లు అరవింద్, హీరో హీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవి, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్, తదితరులు హాజరవుతున్నారన్నారు. పాకిస్తాన్‌లో చిక్కుకొని అనంతరం విడుదలైన 22 మంది మత్స్యకారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని పేర్కొన్నారు. సక్సెస్ మీట్‌కు అనుమతినిచ్చిన పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చిత్రాన్ని భారీస్థాయిలో విజయవంతం చేసిన విధంగా విజయోత్సవ సభను కూడా విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో తండేల్ మూవీ కథా రచయిత కార్తీక్ పాల్గొన్నారు.

Also Read: India vs England: మూడు వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. సిరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా

ఇక‌పోతే తండేల్ మూవీ ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. విడుద‌లైన అన్ని చోట్ల ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే ఈ మూవీ రూ. 80 కోట్ల పైచిలుకు వ‌సూల్ సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది. తండేల్ మూవీ మ‌త్య్స‌కారుల జీవితం ఆధారంగా చీత్రిక‌రించారు. ఈ మూవీలో నాగ చైత‌న్య న‌ట‌న‌కు విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి న‌ట‌న సైతం ఈ మూవీలో అద్భుతంగా న‌టించింది. ఇక‌పోతే ఈ సినిమా స‌క్సెస్ మీట్‌ను శ్రీకాకుళంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ మూవీని నిర్మాత బ‌న్నీ వాసు నిర్మించగా.. చందూ మొండేటి డైరెక్ట్ చేశారు.