Thandel : నాగచైతన్య(Naga Chaitanya) త్వరలోనే హీరోయిన్ శోభిత(Shobita)ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం అయింది, పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. ఇటీవల అక్కినేని నేషనల్ అవార్డు వేడుకలో కూడా శోభిత సందడి చేసింది. పెళ్లి కాకుండానే అత్తారింటి వేడుకలో అలరించింది. నాగచైతన్య – శోభిత పెళ్లి డిసెంబర్ లో ఉండొచ్చని సమాచారం.
అయితే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా షూటింగ్ ఇంకా అవ్వకపోవడంతో వాయిదా వేశారు. అయితే సంక్రాంతికి అయినా ఈ సినిమా ఉంటుంది అనుకున్నారు. కానీ సంక్రాంతికి రామ్ చరణ్, వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి. దీంతో తండేల్ రిలీజ్ కాకపోవచ్చు అని ఇటీవల డైరెక్టర్ చందూ మొండేటి చెప్పాడు.
తండేల్ ఇంకా 20 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉండటం, మధ్యలో నాగ చైతన్య పెళ్లి ఉండటం, సంక్రాంతికి ఆల్రెడీ భారీ సినిమాలు ఉండటంతో సంక్రాంతి నుంచి కూడా తండేల్ సినిమా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. పెళ్లికి ముందు షూట్ పూర్తిచేసి పెళ్లి, పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని అనంతరం ప్రమోషన్స్ లోకి చైతు వస్తాడని తెలుస్తుంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ చైతు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తండేల్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Amy Jackson : రెండోసారి ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. దీపావళి నాడు భర్తతో బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి..