Thandel : సముద్రం మధ్యలో ‘తండేల్‌’.. త్వరలో ఎగ్జైటింగ్ అప్‌డేట్స్

Thandel : మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'తండేల్' రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో ప్రారంభమైంది.

Published By: HashtagU Telugu Desk
Thandel

Thandel

Thandel : యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

షూటింగ్ జరుగుతున్న ఈ లెన్తీ షెడ్యూల్‌లో టీమ్ కొన్ని కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్స్ ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం సముద్రం మధ్యలో అడ్రినలిన్ పంపింగ్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. టీమ్ షేర్ చేసిన ఫోటోలో నాగ చైతన్య సముద్రం వైపు నడుస్తూ ఆనందంగా కనిపిస్తున్నారు. మేకర్స్ త్వరలో కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో(Thandel) రానున్నారు.

కంప్లీట్ మేకోవర్‌ అయిన నాగ చైతన్య ఈ సినిమాలో మునుపెన్నడూ లేని గెటప్‌లో కనిపించనున్నారు. షూట్ ప్రారంభించడానికి ముందు ఇంటెన్స్ ట్రైనింగ్, హోంవర్క్ చేశారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తండేల్ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.

Also Read: Sriya Reddy : ‘సలార్ సీజ్ పైర్’‌ను మించి ‘సలార్ పార్ట్ 2’ ఉంటుంది: శ్రియా రెడ్డి

అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
మార్కెటింగ్: ఫస్ట్ షో

  Last Updated: 27 Dec 2023, 05:18 PM IST