వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కు తండేల్ ఊపిరి పోసింది. సవ్యసాచి , ప్రేమమ్ చిత్రాల డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో చైతూకు జోడిగా సాయి పల్లవి నటించగా… గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్ వీక్ సందర్భంగా నిన్న ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
దేవి శ్రీ మ్యూజిక్, చైతు , సైపల్లవి యాక్టింగ్ , చందు డైరెక్షన్ ఇవన్నీ కూడా సినిమా విజయంలో కీలకమయ్యాయి. సినిమాకు హిట్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే మంచి వసూళ్లు రాబట్టింది.తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ‘తండేల్’ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఫిబ్రవరిలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఇంత భారీ ఓపెనింగ్ మరే ఏ సినిమా సాధించలేదు. దీంతో అరుదైన ఘనత సాధించిన సినిమాగా తండేల్ నిలిచింది.