వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)..ప్రస్తుతం ఆశలన్నీ తన 23 వ చిత్రం తండేల్ (Thandel ) పైనే పెట్టుకున్నాడు. సవ్యసాచి , ప్రేమమ్ చిత్రాల డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో చైతూకు జోడిగా సాయి పల్లవి నటిస్తుండగా… గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వాలెంటైన్ వీక్ సందర్భంగా 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ యూత్ ను ఆకట్టుకోగా.. గురువారం బుజ్జితల్లి (Bujji Thalli) అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాలు పెంచారు. శ్రీమణి రాసిన లిరిక్స్.. బుజ్జి తల్లి పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇద్దరు మనుషులు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ లిరిక్స్‌లో అందంగా వివరించారు. బుజ్జి తల్లి పాటలో మరొక హైలెట్‌గా నిలిచిన విషయం జావేద్ అలీ వాయిస్.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుంది. ఈ క్రమంలో కొందరు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాల గురించి ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్‌లో కనిపిస్తుండగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకోబోతుంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also : Bhadradri : భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారు