Site icon HashtagU Telugu

‘Thandel’ : మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే..!

Thandel 3 Days Collections

Thandel 3 Days Collections

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కు తండేల్ ఊపిరి పోసింది. సవ్యసాచి , ప్రేమమ్ చిత్రాల డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో చైతూకు జోడిగా సాయి పల్లవి నటించగా… గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్ వీక్ సందర్భంగా నిన్న ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

దేవి శ్రీ మ్యూజిక్, చైతు , సైపల్లవి యాక్టింగ్ , చందు డైరెక్షన్ ఇవన్నీ కూడా సినిమా విజయంలో కీలకమయ్యాయి. సినిమాకు హిట్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 21 కోట్లను రాబట్టగా, రెండో రోజు రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. తొలి రెండు రోజుల్లో రూ. 41 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. మూడో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. మూడో రోజుకు రూ. 62.37 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మారే చిత్రం పోటీలో లేకపోవడంతో… ‘తండేల్’ భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటు అక్కినేని అభిమానులు సైతం ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

నాగార్జున అయితే తన ఆనందానికి అవధులు లేవు అన్నట్లు చెప్పకనే చెప్పాడు. ఒక తండ్రిగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా ఎంత కష్టపడ్డావో, ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నావో చూస్తూనే ఉన్నానని చైతూని ఉద్దేశించి అన్నారు. ‘తండేల్’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు… నీ శ్రమకు నిదర్శనం అని చెప్పారు. నిన్ను చూస్తూంటే గర్వంగా ఉంది చైతూ అని ట్వీట్ చేసారు.