Site icon HashtagU Telugu

Nithin Thammudu : తమ్ముడు ట్రైలర్ టాక్

Thammudu Trailer

Thammudu Trailer

నితిన్‌ హీరోగా, వేణు శ్రీరామ్‌ (Nithin – Venusriram) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తమ్ముడు’ (Thammudu). ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ బుధువారం విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ట్రైలర్‌ విడుదలైన వెంటనే మంచి స్పందన లభిస్తోంది. కథలోని ప్రధాన అంశం.. అక్కకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తమ్ముడి తపన. “తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ క్యారెక్టర్ లూజ్ అవ్వలేదు” వంటి డైలాగ్స్‌తో ఈ భావోద్వేగాన్ని బలంగా అందించారు. ఇది కేవలం ఓ సెంటిమెంట్ డ్రామా మాత్రమే కాకుండా యాక్షన్‌తో కూడిన ఉత్కంఠభరిత కథగా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

Mangli : మంగ్లీ ఎఫ్‌ఐఆర్‌ కాపీలో కీలక విషయాలు

ట్రైలర్ విషయానికి వస్తే.. “అబంరగొడుగు” అనే ఊరు. ట్రైలర్‌లో ఈ ఊరిని కథకు కేంద్ర బిందువుగా చూపించారు. అక్కడికి వెళ్లాలన్నా, రావాలన్నా ఒక్కటే దారి ఉండటం వలన వచ్చే పరిమితులు, సమస్యలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. విలువిద్య క్రీడాకారుడిగా నితిన్ పాత్ర చూపించడం, అటవీ ప్రాంతంలో ఆ క్రీడను ఎలా వాడుకున్నాడనే అంశం పాజిటివ్ హైలైట్‌గా నిలిచింది. “ప్రేమతో చెబితే అర్థం కాదు… అదే వైలెన్స్‌తో చెబితే!” అనే డైలాగ్ ద్వారా హీరో భావోద్వేగాన్ని చూపించారు.

ఈ సినిమాలో లయ అక్క పాత్రలో కనిపించగా, ఆమె ప్రెజెన్స్ తక్కువ ఉన్నా, ట్రైలర్‌లో తగినంత ప్రభావం చూపించింది. అలాగే సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాసిక వంటి నటీమణులు పాత్రలకు న్యాయం చేసినట్లు కనిపిస్తోంది. అజినీస్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకు ప్రాణం పోసింది. ట్రైలర్ ప్రారంభం నుంచీ ముగింపు వరకు అక్క సెంటిమెంట్ చుట్టూ కథ నడుస్తూ, ప్రేక్షకులను భావోద్వేగంగా అనుసంధానించే ప్రయత్నం చేసింది. అన్ని అంశాలు సరిగ్గా పని చేస్తే ‘తమ్ముడు’ నితిన్ కెరియర్ ను మార్చే సినిమా అవుతుంది. మరి వేణు శ్రీరామ్ ఇచ్చేసాడో తెలియాలంటే జులై 04 వరకు ఆగాల్సిందే.