యంగ్ హీరో నితిన్ (Nithin) నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(Thammudu ) ఈరోజు జూలై 4న గ్రాండ్‌గా విడుదలైంది. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా, ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ నటించిన క్లాసిక్ మూవీ తమ్ముడు టైటిల్‌ను పెట్టుకోవడం, దిల్ రాజు సినిమాను నిర్మించడం తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడం లో తమ్ముడు ఘోరంగా విఫలమయ్యాడు. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం..అసలు డైరెక్టర్ ఏంచెప్పాలనుకున్నాడో కూడా చెప్పలేకపోయేసరికి సినిమా చూసిన ప్రతి ఒక్కరు నిరాశకు గురయ్యారు. ఫస్ట్ టాక్ తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. ఇక కలెక్షన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.
Suresh Raina : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ క్రికెటర్
దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘తమ్ముడు’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.2 కోట్ల కలెక్షన్లు వచ్చాయని వెల్లడించాయి. ఈ చిత్రానికి మొదటి రోజు 27 వేలలోపే టికెట్స్ అమ్ముడుపోయాయని పేర్కొన్నాయి. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఉదయం షోలతో పోల్చితే సాయంత్రానికి ఆక్యుపెన్సీ తగ్గినట్లు తెలిపాయి. సోమవారం నుండి అన్ని థియేటర్స్ ఖాళీ అవ్వడం ఖాయమని తేల్చి చెపుతూ నితిన్ ఖాతాలో మరో డిజాస్టర్ అని చెపుతున్నారు.