Game Changer : శంకర్ మార్క్ పెద్ద ఫీస్ట్.. గేమ్ చేంజర్ పై థమన్ కామెంట్స్ తో మెగా ఫ్యాన్స్ ఖుషి..!

Game Changer ఆచార్య తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 12:25 AM IST

Game Changer ఆచార్య తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శంకర్ సినిమా అంటే రెహమాన్ మ్యూజిక్ ఉంటుంది. కానీ ఈసారి థమన్ తో కొత్తగా ట్రై చేస్తున్నాడు శంకర్.

గేమ్ చేంజర్ సాంగ్స్ పై మెగా ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఆల్రెడీ సినిమా నుంచి వచ్చిన జరగండి సాంగ్ అదరగొట్టగా త్వరలో సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా థమన్ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. గేమ్ చేంజర్ ఎలా వస్తుంది అన్న విషయంపై మాట్లాడిన థమన్ మెగా ఫ్యాన్స్ కు పెద్ద ఫీస్ట్ అందిస్తుందని. శంకర్ మార్క్ సినిమాగా గేమ్ చేంజర్ వస్తుందని అన్నారు.

థమన్ చేసిన ఈ కామెంట్స్ ఫ్యాన్స్ కి కిక్ ఎక్కిస్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమా తో శంకర్ కూడా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. శంకర్ ఈ సినిమాతో పాటుగా కమల్ హాసన్ తో భారతీయుడు 2 కూడా చేస్తున్నారు. ఇండియన్ 2 జూలై లో రిలీజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.