Site icon HashtagU Telugu

Balakrishna- Thaman : బాలకృష్ణ చిన్నపిల్లాడు అంటూ తమన్ కామెంట్స్

Balakrishna Thaman

Balakrishna Thaman

నందమూరి బాలకృష్ణ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రశంసల జల్లు కురిపించారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కుతున్న మూవీ #NBK109 కు డాకు మహారాజ్ అంటూ ఓ పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈరోజు పౌర్ణమి సందర్బంగా టైటిల్ ను ప్రకటిస్తూ..ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక టైటిల్ ప్రకటన సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. హీరో బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. ‘టెక్నీషియన్స్ ను బాలకృష్ణ గుడ్డిగా నమ్మేస్తారు. ఆయనతో 6 సినిమాలు చేశాను. నా స్టూడియోకి వస్తే చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేస్తారు. అఖండ-2 ఉంది చాలా భారీగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

టీజర్ విషయానికి వస్తే..

“ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది” అంటూ ఓ పవర్​ఫుల్ డైలాగ్​తో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్​గా సాగింది. “గుర్తుపట్టావా నన్ను. నేనే డాకు మహారాజ్‌” అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్స్‌, విజువల్స్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్ ఆఖరిలో బాలయ్య న్యూ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘NBK 109’తో పాటు ‘BB4’ (బాలకృష్ణ బోయపాటి 4) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నాలుగోసారి కలిసి పనిచేస్తుండడం విశేషం. 14 రీల్స్‌ ఎంటర్​టైన్​మెంట్‌ బ్యానర్​పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తుండగా, బాలయ్య కుమార్తె తేజస్విని కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.