మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) డైపర్ వేసుకున్న విషయం తెలిపి అందర్నీ నవ్వుల్లో ముంచాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ హావ నడుస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరో సినిమా అంటే దానికి థమన్ మ్యూజిక్ ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయ్యే రేంజ్ కి చేరుకున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న థమన్..ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ కి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చి శంకర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తనకు గేమ్ ఛేంజర్ అవకాశం అనేది దిల్ రాజు ముందు చెప్పాడని థమన్ చెప్పుకొచ్చాడు.
‘వకీల్ సాబ్’ సినిమాకు పని చేస్తున్న సమయంలో దిల్ రాజు తనకు కాల్ చేసి శంకర్ (Shankar) మూవీలో ఆఫర్ చేశారని తమన్ తెలిపారు. ఆ రోజు భయంతో డైపర్ వేసుకున్నట్లు ‘గేమ్ ఛేంజర్’ గ్లోబల్ ఈవెంట్లో థమన్ చెప్పుకొచ్చాడు. ఈ మాట చెప్పగానే అక్కడే ఉన్న చరణ్, సుకుమార్ పడి పడి నవ్వారు. శంకర్ అనగానే తనకు భయం వేసిందని తమన్ పేర్కొన్నారు. తనకు యాక్టింగ్ రాదని తెలిసీ బాయ్స్ సినిమాలో శంకర్ ఛాన్స్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. శంకర్ – రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న భారీ ఎత్తున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమా పై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నాడు.
Read Also : Viral : అల్లు అర్జున్ పై సెటైరికల్ సాంగ్