తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ హీరో దళపతి విజయ్ గురించి మన ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దళపతి ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాలలో పూర్తిగా బిజీ బిజీ అవ్వకముందే తన చివరి సినిమాను పూర్తి చేయాలని భావించారు విజయ్. అందుకోసమే విజయ్ తన చివరి సినిమా అయిన జన నాయగన్ అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా మారబోతున్నారు విజయ్.
ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ తన కారును డ్రైవ్ కోసం తీసుకెళ్లాడు. ఆ సమయంలో విజయ్ వెంట తమిళనాడు విక్టరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పుస్సీ ఆనంద్ కూడా ఉన్నారు. అయితే విజయ్ తన చుట్టూ ఉన్న అభిమానులను చూడటానికి కారును కాసేపు ఆపి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ రోజు చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత, నటుడు విజయ్ తన లగ్జరీ కారు తీసుకొని బయటకు వెళ్ళాడు. అప్పుడు, విజయ్ ను రోడ్డుపై చూసిన వెంటనే, కొంతమంది విజయ్ కారును వెంబడించడం ప్రారంభించారు. విజయ్ కారు వెళుతున్న కొద్ది వెనకాలే ఫాలో అవ్వడం ప్రారంభించారు. దాంతో వెంటనే విజయ్ వారిని చూసి కారు ఆపి, వారిని పలకరించి చేయి ఊపి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
Thalapathy @actorvijay was spotted driving his car post #Jananayagan shoot 🎥 pic.twitter.com/oHySX1uDYI
— Vijay Fans Trends (@VijayFansTrends) February 17, 2025
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే విజయ్ కెరియర్ విషయానికి వస్తే.. విజయ్ నటిస్తున్న తన చివరి చిత్రం జన నాయగన్ కి డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తన సినీ కెరీర్ కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ తో పాటు పూజా హెగ్డే, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, బాబీ డియోల్, మమితా బైజు, నరైన్ తదితరులు కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.