Site icon HashtagU Telugu

Thalapathy Vijay: రాజకీయాల్లోకి విజయ్ దళపతి, తమిళనాడు లక్ష్యంగా పొలిటికల్ స్పీచ్!

Vijay Thalapathy

Vijay Thalapathy

తమిళ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సూపర్ స్టార్లలో దళపతి విజయ్ ఒకరు. సినిమాల్లోనే కాకుండా రాజకీయపరమైన వ్యవహారాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 10, 12 తరగతుల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. విజయ్ డబ్బుకు ఓటు వేయవద్దని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి జాతీయ నాయకుల గురించి చదవాలని విద్యార్థులకు సూచించారు.

విజయ్ రాజకీయాల్లోకి రావడం గురించి నేరుగా సూచించనప్పటికీ, రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తాయనే దానిపై తాను అసంతృప్తిగా ఉన్నానని తేల్చి చెప్పాడు. ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడానికి వ్యతిరేకించిన ఆయన “మీరు రేపటి ఓటర్లు. మీరు భవిష్యత్ నాయకులను ఎన్నుకుంటారు అని విద్యార్థులకు హితబోద చేశారు. 1.5 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో ఓటరుకు రాజకీయ నాయకుడు రూ. 1000 ఇస్తున్నాడని, ఒక వ్యక్తి రూ.15 కోట్లు లంచం ఇస్తే అంతకు ముందు ఎంత సంపాదించి ఉంటాడో ఆలోచించండి! ఇవన్నీ మీ విద్యా విధానంలో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఓటు వేయడానికి డబ్బు తీసుకోవద్దని మీ తల్లిదండ్రులకు వెళ్లి చెబితే మార్పు వస్తుంది అని విజయ్ సూచించారు.

విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు SA చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు, అతనితో జనరల్ సెక్రటరీగా మరియు తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. పార్టీ సంక్షేమ సంస్థగా రూపాంతరం చెందింది. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేసి విజయం సాధించింది. నటుడు కూడా వ్యక్తిగతంగా పార్టీ సభ్యులను కలుసుకుని 115 సీట్లు గెలుచుకున్నందుకు వారిని అభినందించారు.

Also Read: 1 Lakh for BCs: బీసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ: కేబినెట్ సబ్ కమిటీ!