Site icon HashtagU Telugu

Thalapathy Vijay: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న విజయ్.. లాస్ట్ సినిమా అదే అంటూ?

Mixcollage 16 Feb 2024 09 16 Am 5593

Mixcollage 16 Feb 2024 09 16 Am 5593

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో దలపతి విజయ్ పేరు కూడా ఒకటి. కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయ దళపతి పేరు మారుమోగిపోతోంది. సినిమాలకు సంబంధించిన విషయాలలో రాజకీయాలకు సంబంధించిన విషయాలలో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇకపోతే ఎప్పటినుంచో విజయ్ రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ వార్తలు వినిపించగా ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవల విజయ్ రాజకీయాలలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

రీసెంట్ గానే సొంత పార్టీని ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆయన కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దళపతి విజయ్ సినిమా గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఇటీవలే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఇప్పుడు దళపతి 68 చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దళపతి సినిమాలకు గుడ్ బై చెప్ప బోతున్నారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినీ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ల జాబితా చాలా పెద్దదే. ఈ వరుసలో విజయ్ కూడా చేరాడు. సినీ ఇండస్ట్రీలోస్టార్ గా ఎదిగిన విజయ్ ఇప్పుడు అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన తన 68వ చిత్రం గోట్‌ మూవీతో బిజీగా ఉన్నారు.

వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. దీని తర్వాత దళపతి విజయ్ తన 69వ సినిమా పనుల్లో బిజీ కానున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరిది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి మూడు సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత సినిమా రంగానికి పూర్తిగా దూరం కానున్నారని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం లేదు.