Site icon HashtagU Telugu

Leo Poster: కిల్లర్ లుక్ లో విజయ్ ‘ లియో ‘

Leo Poster

Leo Poster

Leo Poster: తమిళ స్టార్ తలపతి విజయ్ నటించిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ‘ లియో ‘ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి తాజాగా పోస్టర్ విడుదల చేశారు. రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఇలా పోస్టర్ల దారి ఎంచుకున్నారు. తాజాగా లియో మేకర్స్ మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు.మంచు పర్వతాల్లో భారీ పోరాటం చేస్తున్నట్టు పోస్టర్లో చూడొచ్చు. పోస్టర్లో లియోను కోల్డ్ బ్లడెడ్‌గా చూపించారు. శత్రువులను ఎవరినీ విడిచిపెట్టని కిల్లర్ లుక్ లో ఉన్నాడు. మరో పోస్టర్లో రెండు గన్స్ తో స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ విజయ్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

గతేడాది లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ చిత్రం సూపర్ హిట్ కావడంతో లియోపై అంచనాలు మరింత పెరిగాయి. దళపతి విజయ్ తో లోకేష్ ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తాడో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లియో.. భారీ అంచనాల మధ్య దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. విజయ్ తో పాటు ఈ సినిమాలో స్టార్స్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష నటిస్తున్నారు.

Also Read: Flipkart- Amazon: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో తక్కువ ధరకే లభిస్తున్న టీవీలు ఇవే.. లిస్టులో ఏమున్నాయంటే..?

Exit mobile version