స్టార్ హీరో విజయ్ దళపతి గురించి మనందరికీ తెలిసిందే. విజయ దళపతి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో బిజీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాలలో నటించి పూర్తిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి రాజకీయాలలో ఫుల్ బిజీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు విజయ్ దళపతి. ఇక ఆయన రాజకీయ ప్రవేశాన్ని అభిమానులు స్వాగతిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ స్థాపించి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మహాబలిపురం లోని ఒక రిసార్ట్ లో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇకపోతే దళపతి విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ తోనూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దళపతి విజయ్ జన నాయగన్ సినిమాకు వీహెచ్ వినోదు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2024 చివరలో ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు మొదటి దశ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం చెన్నైలో రెండవ దశ షూటింగ్ జరుగుతోందట. ఈ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని టాక్.
అయితే ఇది కొత్త కథాంశంతో కూడిన సినిమా అని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ జన నాయగన్ సినిమా షూటింగ్ మే 2025 నాటికి పూర్తవుతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను జనవరి 26, 2025న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వీరితో పాటు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, శ్రుతి హాసన్, మమతా బైజు, వరలక్ష్మి శరత్‌కుమార్, రెబా మోనికా జాన్, డిజె అరుణాచలం వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమా అక్టోబర్ 2025 లో విడుదల అవుతుందని చెప్పినప్పటికీ, ఇప్పుడు 2026 లో పొంగల్ సందర్భంగా విడుదల కానుందట.