Thalapathy Vijay సౌత్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో దళపతి విజయ్ ఒకరు. ముఖ్యంగా కోలీవుడ్ లో రజినికి ఈక్వెల్ క్రేజ్ ఉన్న స్టార్ ఆయనే. విజయ్ సినిమా అంటే పక్కా హిట్ అనే రేంజ్ తెచ్చుకున్నాడు. సినిమా ఎలా ఉన్నా ఫ్యాన్స్ అతని సినిమాలు హిట్ చేస్తారు. వరుసగా 200 కోట్ల క్లబ్ లో విజయ్ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. నేడు దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) డైరెక్షన్ లో తెరకెక్కిన లియో సినిమా రిలీజైంది.
ఈ సినిమా మీద ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా లియో (LEO) క్రేజ్ తెచ్చుకుంది. లియో సినిమా తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయితే విజయ్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నా ప్రమోషన్స్ మాత్రం నామ మాత్రంగానే ఉన్నాయి. మిగతా హీరోలంతా కూడా తమ సినిమా తెలుగు రిలీజ్ ఉంటే ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేస్తుంటారు.
కానీ విజయ్ మాత్రం తెలుగు ప్రమోషన్స్ అంటే ఆసక్తి చూపించరు. తెలుగు ప్రమోషన్స్ (Telugu Promotions) కు విజయ్ చూపిస్తున్న ఈ నిర్లక్ష్యానికి తెలుగు ఆడియన్స్ కొందరు అసంతృప్తిగా ఉన్నారు. విజయ్ తెలుగులో ప్రమోషన్స్ చేయకపోవడం వెనక రీజన్స్ ఏంటన్నది తెలుసోవాలని అనుకుంటున్నారు.
తన ప్రతి సినిమా తెలుగులో మంచి మార్కెట్ చేస్తున్నా విజయ్ మాత్రం తెలుగు ప్రమోషన్స్ ని లైట్ తీసుకుంటున్నాడు. అయితే సినిమా గురించి మనం మాట్లాడటం కాదు బాగుంటే సినిమానే మాట్లాడుతుందనే నమ్మకం కావొచ్చు కానీ దళపతి విజయ్ తెలుగు ప్రమోషన్స్ చేయకపోవడం వెనుక కారణాలు బయటకు రావాల్సి ఉంది.
Also Read : Vijay Devarakonda : క్లాస్ టైటిల్ మాస్ అప్పీల్.. రౌడీ హీరో గేర్ మార్చాడా..?