తమిళ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ స్టార్ వారసుడు మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళంలో మాత్రం వరిసు పేరుతో విడుదలవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, PVP నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ 66 వ చిత్రం. ఈ మూవీ సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విజయ్ ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.
దళపతి విజయ్ వరిసు కోసం రూ. 150 కోట్లు వసూలు చేశాడని టాక్ వినిపిస్తోంది. సౌత్, బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సౌత్ నటులలో విజయ్ ఒకడు. అందుకే నిర్మాతలు విజయ్ కు పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది. విజయ్ సినిమాల ఎంపిక ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్ లాంటి డైరెక్టర్స్ తో విజయ్ తదుపరి సినిమాలు చేయబోతున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్‌తో ఒక ఇంటర్వ్యూలో.. విజయ్ పూర్తిగా స్క్రిప్ట్‌ల ఆధారంగా సినిమాలు చేస్తారని, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటాడని చెప్పారు.
ఓవర్సీస్ పాపులారిటీ
విజయ్ పాపులారిటీ కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ పై ప్రభావం చూపే హీరో కూడా విజయ్ మాత్రమే. వరిసు ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న తమిళంలో, జనవరి 13న హిందీలో, తెలుగులో సంక్రాంతి స్పెషల్‌గా 14న విడుదల కానుంది. ఇప్పటికే వారసుడు మూవీలోని రంజితమే సాంగ్ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ చిత్రంలో నటిస్తున్నారు. కాగా, లోకేశ్ కనగరాజ్‌తో విజయ్ తలపతి 67 షూటింగ్ జనవరి 2 న చెన్నైలో ప్రారంభమైంది.