Site icon HashtagU Telugu

200 Crores Remuneration : ఆ స్టార్ హీరోకి 200 కోట్ల పారితోషికం.. ఇండియా లోనే టాప్..!

Vijay Thalapathy

Vijay Thalapathy

200 Crores Remuneration కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ అంటే తమిళ ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ అంతా సూపర్ ఎక్సైటింగ్ గా ఉంటారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న దళపతి విజయ్ ప్రతి సినిమాతో తన అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ దసరాకి లియో సినిమాతో వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న విజయ్. ప్రస్తుతం గోట్ సినిమా చేస్తున్న విజయ్ మళ్లీ దసరా రేసులో ఉంటారని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మధ్యనే సొంత రాజకీయ పార్టీ అనౌన్స్ చేసిన దళపతి విజయ్ చివరగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఆ సినిమా తెలుగు నిర్మాణ ప్రొడక్షన్లో ఉంటుందని తెలుస్తుంది. RRR నిర్మాత డివివి దానయ్య దళపతి విజయ్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నారని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త. లేటెస్ట్ గా అదే నిజమవుతూ దానయ్య నిర్మాణంలో విజయ్ సినిమా ఉంటుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తెలియదు కానీ ఈ సినిమా కోసం దళపతి విజయ్ 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్.

సౌత్ హీరోలు క్రేజ్ లో బాలీవుడ్ స్టార్స్ కి ఈక్వల్ గా మారారు. ఇప్పుడు రెమ్యూనరేషన్ లో కూడా వాళ్ళని మించి డిమాండ్ చేస్తున్నారు. విజయ్ 200 కోట్ల రెమ్యూనరేషన్ నిజమే అయితే ఇండియా మొత్తం మీద భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మొదటి హీరోగా దళపతి విజయ్ రికార్డు సృష్టించినట్టే. ఇంతకీ దానయ్య ప్రొడక్షన్లో దళపతి విజయ్ చేస్తున్న సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ బయటకు వస్తాయి.