Site icon HashtagU Telugu

Prabhas & Thalapathy: సంక్రాంతికి బిగ్ ఫైట్.. ప్రభాస్ కు పోటీగా తలపతి విజయ్!

Prabhas And Vijay

Prabhas And Vijay

సంక్రాంతి బరిలో పలు సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ ఈసారి ఫైట్ తమిళ్ హీరో విజయ్, ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ మధ్య గట్టిపోటీ ఉండబోతోంది. సెప్టెంబర్ 2న ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల కానున్నాయని ‘ఆదిపురుష’ టీమ్ భారీ అప్ డేట్ ఇచ్చింది. అయోధ్యలోని సరయు నది ఒడ్డున విడుదల చేయనున్నారు. అంతే కాకుండా, ఈ హై-బడ్జెట్ మూవీ 2023 జనవరి 12న థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యపీగా ఉన్నారు. 2023 సంక్రాంతి సీజన్‌లో విడుదల కాబోయే ఈ సినిమాకు మరో పెద్ద సినిమా పోటీగా విడుదల కాబోతోంది.

పాన్-ఇండియన్ హీరో ప్రభాస్ ‘ఆదిపురుష’ జనవరి 12న వస్తుందని ప్రకటించగా, అదే రోజు తలపతి విజయ్ రాబోయే చిత్రం ‘వరిసు’ కూడా రాబోతోంది. తెలుగులో వారసుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుకున్న సమయానికి విడుదల చేయడానికి విజయ్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. తెలుగు, హిందీ మార్కెట్లలో ‘ఆదిపురుష’ మంచి వసూళ్లు సాధిస్తుందనడంలో సందేహం లేకపోయినా విజయ్‌కి బలమైన మార్కెట్ ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో గట్టి పోటీ రానుంది. ఇది ‘ఆదిపురుష’ కలెక్షన్లపై కొంత ప్రభావం చూపవచ్చు.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించారు. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ ‘ఆదిపురుష్’లో లంకేష్ పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా కనిపించనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో సన్నీ సింగ్ లక్ష్మణ్‌గా కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘వరిసూ’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది తమిళ చిత్రం, ఇది వివిధ భాషలలోకి డబ్ చేయబడుతుంది. సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే ఈ రెండు సినిమాల్లో ఏదీ పైచేయి సాధిస్తోందో వేచి చూడాల్సిందే.