కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశం చేయగానే ఫ్యాన్స్ అంతా ఇక ఆయన సినిమాలు మానేస్తారేమో అనుకున్నారు. కానీ సినిమాలు చేస్తూ కూడా రాజకీయాల్లో రాణించవచ్చు అని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతూ పాలిటిక్స్ సినిమాలు రెండిటినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాడు విజయ్. ఈమధ్యనే తన పార్టీ మొదటి మీటింగ్ తోనే సూపర్ అనిపించుకున్న విజయ్ ఇటు సినిమాల్లోనూ తన వేగాన్ని పెంచాడు.
ప్రస్తుతం హెచ్.వినోద్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్ తన నెక్స్ట్ సినిమాను స్టార్ డైరెక్టర్ మురుగదాస్ (Murugadoss) డైరెక్షన్ లో చేస్తాడని తెలుస్తుంది. దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా మురుగదాస్ డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. దళపతి విజయ్ (Thalapathi Vijay), మురుగదాస్ ఇద్దరు కలిసి తుపాకి (Tupaki) , సర్కార్ అనే రెండు సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు కూడా ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించాయి.
సొసైటీకి ఉపయోగపడే సినిమాలు..
ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మూడో సినిమా చేయనున్నారు. దళపతి విజయ్ ఇక మీదట తన సినిమాల్లో కూడా ప్రజల గురించి కథ కథనాలు ఉండేలా చూసుకుంటున్నారు. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చెక్ పెట్టి సొసైటీకి ఉపయోగపడే సినిమాలు చేస్తాడని తెలుస్తుంది.
విజయ్ మురుగదాస్ సినిమా కచ్చితంగా అలాంటి బ్యాక్ డ్రాప్ తోనే వస్తుందని టాక్. ప్రస్తుతం మురుగదాస్ శివ కార్తికేయన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే దళపతి విజయ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
Also Read : Anushka Ghaati : ఘాటి అనుష్క స్క్రీన్ నేమ్ తో ఫ్యాన్స్ ఖుషి.. ఇంతకీ ఏం పెట్టారో తెలుసా..?