కోలీవుడ్ లో దళపతి విజయ్ గోట్ (GOAT) రికార్డుని బద్ధలు కొట్టాడు అక్కడ మరో స్టార్ శివ కార్తికేయన్. లేటెస్ట్ గా ఆయన లీడ్ రోల్ లో నటించిన అమరన్ సినిమాను రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా తమిళంతో పాటుగా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
దీపావళికి తెలుగులో క, లక్కీ భాస్కర్ రిలీజ్ అయ్యాయి వాటికి పోటీగా అమరన్ (Amaran) వచ్చింది. మరోపక్క తమిళంలో కూడా ఈ సినిమాకు పోటీగా బ్రదర్, బ్లడీ బెగ్గర్ రిలీజ్ అయ్యాయి. ఐతే వీటి;లో అమరన్ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మేజర్ ముకుంద్ వరద రాజన్ గా శివ కార్తికేయన్ (Shiva kartikeyan) అదరగొట్టాడు. ఆర్మీ మ్యాన్ ఫ్యామిలీ లైఫ్ ను ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా చూపించారు.
బుక్ మై షో టికెట్ బుకింగ్స్..
ఐతే ఈ సినిమాకు బుక్ మై షో టికెట్ బుకింగ్స్ దళపతి విజయ్ (Thalapathi Vijay,) గోట్ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేశాయి. దళపతి విజయ్ గోట్ సినిమాకు ఒకరోజులో అత్యధిక బుక్ మై షో (BMS) టికెట్స్ బుక్ అయిన రికార్డ్ ఉంది. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ ను శివ కార్తికేయన్ సినిమా మొదటి రోజు బ్రేక్ చేయడం విశేషం. యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు శివ కార్తికేయన్.
తెలుగులో కూడా అమరన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీపావళికి తెలుగులో రిలీజైన అమరన్, లక్కీ భాస్కర్, క మూడు సినిమాలకు హిట్ టాక్ రావడం విశేషం.
Also Read : Samantha : రాజస్థాన్ ఫోర్ట్ లో సమంత దీపావళి సెలబ్రేషన్స్..!