Site icon HashtagU Telugu

Thalaivar 171: రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. తలైవర్ 171 టీజర్ వచ్చేస్తోంది

Thalaivar 171 announced Rajinikanth in Lokesh Kanagaraj Direction

Thalaivar 171 announced Rajinikanth in Lokesh Kanagaraj Direction

Thalaivar 171:  సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత ‘తలైవర్ 171’లో గ్రే షేడ్ పాత్రలో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్, రజినీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘తలైవర్ 171’తో తాను భిన్నంగా ట్రై చేస్తున్నానని లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది.మరికొద్ది గంటల్లో ఈ ఈ మూవీ టైటిల్ టీజర్ చూడబోతున్నాం. రజినీకాంత్ అభిమానులే కాదు ఇతర అభిమానులు ఈ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లోకేశ్ కనగరాజ్ ‘విక్రమ్’ టైటిల్ టీజర్ అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా, తలైవర్ 171 టైటిల్ టీజర్ తో కూడా రజనీ అభిమానులు అదే మ్యాజిక్ ఆశిస్తున్నారు.లియో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ విషయంలో లోకేష్ కనగరాజ్ పై విమర్శలు వచ్చాయి. మరి తలైవర్ 171 ద్వారా ఆయన ఏం చేయబోతున్నారో చూడాలి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Also Read: Vishwambhara: విశ్వంభర లో భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్.. ఆ సీన్స్ సినిమాకే హైలైట్