బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ చిత్రం విడుదల వాయిదా పడడంపై ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ‘అఖండ 2’ విడుదల సమస్య తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు చెప్పిన సమయానికి విడుదల కాకపోతే దాని ప్రభావం పరిశ్రమలోని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక బృందాలతో పాటు చిన్న సినిమా విడుదల తేదీలపై కూడా పడుతుందని అన్నారు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్‌తో పోల్చుకుని సరైన సమయం కోసం చిన్న సినిమాల నిర్మాతలు ఎదురుచూసే పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. అందుకే విడుదల కావాల్సిన సమయంలో సినిమాలు ఆగిపోవడం చాలా దురదృష్టకరమని, లాస్ట్ మినిట్‌లో ఇలాంటి అంతరాయాలు కలిగించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని విశ్వప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు.
Indigo Flights Cancellation: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 115 విమాన సర్వీసులు రద్దు
పెద్ద సినిమాల విడుదల చుట్టూ లాస్ట్ మినిట్‌లో జరిగే అవాంతరాలను నివారించడానికి చట్టపరమైన మార్గదర్శకాలు (Legal Guidelines) రూపొందించడం చాలా ముఖ్యమని విశ్వప్రసాద్ నొక్కి చెప్పారు. ఈ రకమైన సమస్యలను నివారించడానికి పరిశ్రమ పెద్దలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా, తమ సినిమా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ విడుదలపై వస్తున్న ఊహాగానాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. సినిమా కోసం తీసుకున్న పెట్టుబడులను (Investments) అన్నీ అంతర్గత నిధుల ద్వారా క్లియర్ చేస్తామని, మిగిలిన వడ్డీని కూడా సినిమా విడుదలకు ముందే పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘అఖండ 2’ గ్రాండ్ రిలీజ్ కోసం తాము కూడా ఎదురుచూస్తున్నామని చెప్పిన విశ్వప్రసాద్ , ‘ది రాజా సాబ్’, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీ, జన నాయగన్, పరాశక్తి వంటి సినిమాలు సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Kakani Govardhan Reddy : కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్
బాలకృష్ణ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ విడుదల ఎప్పుడు అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థిక కారణాల వల్ల ఈ నెల 5న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సమస్య ఓ కొలిక్కి వచ్చిందని, చర్చలు ముగిశాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమ పెద్దలు ఇందులో జోక్యం చేసుకుని సినిమా విడుదలకు మార్గం సుగమం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘అఖండ 2’ను ఫైనల్‌గా ఈ నెల 12న కానీ, లేదా క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న కానీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
