Site icon HashtagU Telugu

Sandhya Theater Incident : రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని TFCC నిర్ణయం

Tfcc

Tfcc

సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Incident)లో చనిపోయిన రేవతి కుటుంబానికి (Revathi Family) ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నిర్ణయించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్కు అండగా ఉంటామని తెలిపింది. వారి కుటుంబానికి సాయం చేసేందుకు మనీ డొనేట్ చేయాలని ఛాంబర్ మెంబర్లను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది.

అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2 (Pushpa 2). ఈ సినిమా ఎంత విజయాన్ని అయితే సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా సాధించి పెట్టిన విజయాన్ని అల్లు అర్జున్ అనుభవించలేకపోతున్నారు. దీనికి కారణం కూడా ఆయనే. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమా చూడడానికి ఆయన సైలెంట్ గా ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి సినిమా చూస్తే సరిపోయేది. కానీ తాను సినిమా చూడడానికి వస్తున్నానని ముందే చెప్పడం తో వేలాది అభిమానులు అక్కడికి చేరుకోవడం, ఆయన్ను చూసేందుకు పోటీపడడంతో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా..ఆమె కుమారుడు శ్రీ తేజ్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత ఆయన హైకోర్టు మధ్యంతరబెయిల్ ద్వారా బయటకు వచ్చారు. కానీ ఈయన చేసిన పనిపట్ల సభ్య సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇదే క్రమంలో చిత్రసీమపై కూడా మండిపడుతున్నారు. ఓ ప్రాణం పోయిన చిత్రసీమ పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ క్రమంలో రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నిర్ణయించింది. సోమవారం సమావేశమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్కు అండగా ఉంటామని తెలిపింది. వారి కుటుంబానికి సాయం చేసేందుకు మనీ డొనేట్ చేయాలని ఛాంబర్ మెంబర్లను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది. మరోపక్క అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ , నిర్మాతలు సైతం రేవతి కుటుంబానికి పెద్ద ఏమౌంట్ నే అందివ్వాలని అనుకుంటున్నట్లు తాజాగా మీడియా సమావేశంలో అల్లు అర్జున్ తెలిపారు.

Read Also : Tech Lookback 2024 : ఈ ఏడాదిలో వాట్సాప్ ప‌రిచ‌యం చేసిన ఫీచ‌ర్స్..!

Exit mobile version