Site icon HashtagU Telugu

Surya : సూర్య ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.. ఎందుకంటే..?

Surya Kanguva First Day Collections

Surya Kanguva First Day Collections

Surya కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం శివ డైరెక్షన్ లో కంగువ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు. పీరియాడికల్ మూవీగా రాబోతున్న కంగువ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పట్ల సూర్య ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.

ప్రభాస్ కల్కి సినిమా చూశాక ప్రతి పాన్ ఇండియా సినిమాలో ఒక చిన్న పాటి జర్క్ ఏర్పడింది. ఎంచుకున్న కథ.. తెరకెక్కించిన విధానంతోనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కల్కి సినిమా కంప్లీట్ గా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు నాగ్ అశ్విన్. ఆ సినిమా చూశాక రెగ్యులర్ రొటీన్ సినిమాలు అసలు రుచించవు. లేదు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే కల్కి రేంజ్ ఉండాలని అంటారు.

ఈ క్రమంలో రాబోతున్న చాలా సినిమాల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సూర్య కంగువ సినిమా మీద కూడా కల్కి సినిమా ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. పీరియాడికల్ కథగా వస్తున్న కంగువ సినిమాలో సూర్య డిఫరెంట్ గెటప్స్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఐతే తప్పకుండా ఈ సినిమాను కల్కితో పోలుస్తారని చెప్పొచ్చు. మరి దర్శక నిర్మాతలు కంగువ సినిమాను ఏమేరకు పాన్ ఇండియా ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా చేస్తున్నారన్నది చూడాలి.

Exit mobile version