Site icon HashtagU Telugu

Telugu Music Directors : పదిమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పాడిన.. ఆర్పీ పట్నాయక్ కోసం.. ఆ పాట ఏంటో తెలుసా..?

Ten Members Telugu Music Directors sing a Song for Rp Patnaik

Ten Members Telugu Music Directors sing a Song for Rp Patnaik

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తున్న పాటని మరో మ్యూజిక్ డైరెక్టర్ పాడడం.. చాలా తరుచుగా జరుగుతుంది. అయితే గతంలో కూడా ఇలా ఒక మ్యూజిక్ డైరెక్టర్(Music Director) పాటకి మరో సంగీత దర్శకుడు గొంతు సవరించారు. ఈక్రమంలోనే ఒక పాట పాడడం కోసం ఏకంగా పది మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. మరి ఆ పాట ఏంటి..? ఆ సంగీత దర్శకులు ఎవరో చూసేయండి..

టాలీవుడ్ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్(RP Patnaik).. దర్శకుడిగా కూడా పలు సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే 2008లో కొత్త నటీనటులతో తెరకెక్కించిన సినిమా ‘అందమైన మనసులో’. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి ఆర్ పి పట్నాయకే సంగీతం అందించారు. ఈ మూవీలో ‘అమ్మాయి నవ్వింది’ అనే ఓ లవ్ సాంగ్ ని ట్యూన్ చేశారు.

ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన కులశేఖర ఈ పాటకి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటని పాడిన ఆ పది మంది సంగీత దర్శకులు ఎవరంటే.. ఎస్ ఏ రాజ్ కుమార్, రాజ్, కోటి, వందేమాతరం శ్రీనివాస్, చక్రి, రమణ గోగుల, ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, శ్రీ కొమ్మినేని, ఆర్ పి పట్నాయక్ కలిసి ఈ పాటని పాడారు. ఆ సాంగ్ రికార్డింగ్ వీడియోని కూడా అప్పటిలో రిలీజ్ చేయగా.. బాగా వైరల్ అయ్యింది. మరి ఆ పాటని మీరు కూడా వినేయండి.

ఆర్ పి పట్నాయక్ దర్శకుడిగా ఇది మొదటి చిత్రం. ఆ తరువాత మరో ఆరు సినిమాలను కూడా డైరెక్ట్ చేశారు. అలాగే నటుడిగా ఐదు సినిమాల్లో నటించారు. కానీ సంగీత దర్శకుడిగా ఎంతో పేరుని సంపాదించుకున్న ఆర్ పి పట్నాయక్.. యాక్టింగ్ అండ్ డైరెక్షన్‌లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఆర్ పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సాంగ్స్ కంపోజ్ చేశారు. హిందీలో కొన్ని సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ చేశారు.

 

Also Read : Akkineni Nagarjuna: బాలీవుడ్ స్టార్ హీరోతో మన్మధుడు