Celebrity Cricket League: మరోసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్

తెలుగు వారియర్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2023 (Celebrity Cricket League) విజేతగా నిలిచారు. విశాఖపట్నం వేదికగా భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
CCL 2023

Resizeimagesize (1280 X 720)

తెలుగు వారియర్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2023 (Celebrity Cricket League) విజేతగా నిలిచారు. విశాఖపట్నం వేదికగా భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ అఖిల్ అక్కినేని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సీసీఎల్‌ చరిత్రలో అత్యధికంగా నాలుగు టైటిల్స్‌ గెలిచిన జట్టుగా తెలుగు వారియర్స్‌ చరిత్ర సృష్టించింది.

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భోజ్‌పురి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ అఖిల్ (67) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన భోజ్‌పురి 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. 58 పరుగుల లక్ష్యంలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన తెలుగు వారియర్స్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించడమే కాకుండా సీసీఎల్ టోర్నీలో నాలుగో టైటిల్ ను కైవసం చేసుకుంది.

Also Read: Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి

CCL-2023 హైలైట్స్

– బెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: తమన్‌

– బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఆదిత్య ఓజా (భోజ్‌పురి)

– మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అఖిల్‌ అక్కినేని

– మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌: అఖిల్‌ అక్కినేని

– ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది సీజన్‌: తమన్‌

– బెస్ట్‌ బౌలర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: ప్రిన్స్‌

– బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: ఆదిత్య ఓజా(భోజ్‌పురి)

  Last Updated: 26 Mar 2023, 06:50 AM IST