Site icon HashtagU Telugu

KGF Beauty: స్టార్ బ్యూటీని మిస్ అవుతున్న టాలీవుడ్ హీరోలు

Srinidhi

Srinidhi

KGF పార్ట్-1, పార్ట్-2 సినిమాలు ఎంతటి సంచలన విజయాలు నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లోనూ కేజీఎఫ్ సిరీస్ దుమ్మురేపింది. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు ఫ్లస్ అయ్యింది. షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఆ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఏమాత్రం మైలేజ్ ఇవ్వలేదు. ఈ వారం విడుదలైన కోబ్రా మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ శ్రీనిధి లుక్స్, నటనకు మంచి మార్కులు పడ్డాయి.

అందం, అభినయం ఉన్న నటి శ్రీనిధి. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. మెడ్రన్, ట్రెడిషన్ దుస్తుల్లో మెస్మరైజ్ చేయగలదు. అయితే తెలుగు నిర్మాతలు పూజా హెగ్డే, రష్మిక మందన్న, రాశి ఖన్నా లాంటి హీరోయిన్‌ల వెంటపడుతుండటంతో శ్రీనిధి లాంటి హీరోయిన్స్ కు తెలుగు ప్రేక్షకులు దూరం కావాల్సి వస్తోంది. TFI కి ఫ్రెష్ టాలెంట్ అవసరం. మన స్టార్ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్‌కి కూడా సరిపోయే వారిలో శ్రీనిధి ఖచ్చితంగా ఒకరు. ఇప్పటికైనా తెలుగు నిర్మాతలు, హీరోలు, దర్శకులు శ్రీనిధి వైపు చూస్తారో లేదా చూడాలి మరి.

Exit mobile version