Site icon HashtagU Telugu

Telugu producers: నిర్మాతల మండలి కీలక నిర్ణయం.. మొదటి ప్రాధాన్యత ఆ చిత్రాలకే..!

Jpg

Jpg

దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయంలో డబ్బింగ్ మూవీల విడుదల కంటే తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలలోని చలనచిత్ర నిర్మాతలు ఎగ్జిబిటర్లను కోరారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షేర్ చేసిన ఓ ప్రకటనలో పండుగల సమయంలో థియేటర్లలో తెలుగు స్ట్రెయిట్ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని బాడీ పేర్కొంది. 2023లో సంక్రాంతి వారాంతంలో రెండు పెద్ద తమిళ చిత్రాలు వరిసు, తునివు విడుదల కానున్నాయి. ఆ రెండు సినిమాల వలన తెలుగు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆ పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొంది: “పెరిగిన తెలుగు చిత్రాల నిర్మాణ వ్యయం, నిర్మాతల సంక్షేమం, తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడటానికి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి తన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 08.12.2019 నుండి సంక్రాంతి, దసరా పండుగల సమయంలో కేవలం తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి అనే తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ విషయంపై ఫిల్మ్‌ చాంబర్‌ ఉపాధ్యక్షుడు దిల్‌రాజు 2019లో ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది. టాలీవుడ్ చిత్రాలు ఉండగా.. డబ్బింగ్‌ చిత్రాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తారని గతంలో దిల్‌ రాజు ప్రశ్నించారు. అందువల్లే ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు తప్పకుండా పాటించాలని లేఖలో వివరించింది. సంక్రాతి, దసరా పండుగల సమయంలో తెలుగు సినిమాలకు మొదటి ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎగ్జిబిటర్స్‌ను కోరింది.

 

 

Exit mobile version