Site icon HashtagU Telugu

Chiranjeevi’s Guinness Record : చిరంజీవికి అభినందనలు తెలిపిన తెలుగు సీఎంలు

Chiru Guinness Cms

Chiru Guinness Cms

మెగాస్టార్ చిరంజీవి కి వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కడంతో మెగా అభిమానులు , సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటూ చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఖాతాలో మరో రికార్డు (Record) చేరింది. సినిమాల్లో అత్యధిక పాటలకు డ్యాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. దీంతో వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. సినీరంగంలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్​కు గాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో ఆదివారం ఈ ఈవెంట్ జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇలా సినిమాల్లో ఎక్కువగా డాన్స్ వేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్​ తేజ్ పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు. చిరంజీవి ఈ అవార్డు దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు అభినందించారు. చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్స్ చోటు దక్కడం గర్వించదగ్గ విషయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సైతం ట్వీట్ చేసారు. తన గ్రేస్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి చేశారని , ఇది చిరంజీవికి గుర్తింపును పెంచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మరింత గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పందిస్తూ.. చిరంజీవి డాన్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తానని, ఆ స్టెప్పులు చూస్తుంటే కళ్లు పక్కకు తిప్పుకోలేమన్నారు. ఇది చాలా అరుదైందని పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని మెగాస్టార్ కు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏ విషయంలోనైనా చిరంజీవి తనను ఆదేశిస్తే సరిపోతుందని, అడగాల్సిన అవసరం లేదని ఆమిర్ పేర్కొన్నారు. మరో వైపు చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ మెగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు.

Read Also : PCOS Effects : పీసీఓఎస్ వ్యాధి వల్ల కూడా నిద్రకు ఆటంకం కలుగుతుందా.?