Site icon HashtagU Telugu

Odela Railway Station: తెలుగు ప్రేక్షకులు మెచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’

Odelu Railwaystation

Odelu Railwaystation

తెలుగు ప్రేక్షకులు ఓదెల రైల్వే స్టేషన్‌ని మెచ్చుకున్నారు. కన్నడ సినిమాలతో ఆకట్టుకుంటున్న వశిష్ట సింహ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం OTT విడుదలైంది. మంచి రివ్యూస్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఓదెల రైల్వే స్టేషన్‌లోని ధోబీగా తిరుపతి అనే పాత్రలో కనిపిస్తాడు వశిష్ట. అతని నటనకు ప్రశంసలు అందుతున్నాయి. సినిమాలో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా నటిస్తున్నాడు. అందాలు ఆరబోసే హెబ్బా పటేల్ ఈ మూవీలో డీగ్లామర్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒదెలా రైల్వే స్టేషన్ మూవీ కరీంనగర్‌లో జరిగిన వాస్తవ కథల ఆధారంగా నిర్మించబడింది. సుద్దాల అశోక్ తేజ, సాయి రోనక్, హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రధారులుగా నటించారు.

Exit mobile version