కుమార్తెలు అరియానా, వివియానా గాయకులుగా మారారని, తన రాబోయే చిత్రం “జీన్నా”లో ఒక పాట పాడారని విష్ణు మంచు ప్రకటించాడు. జూలై 24 న పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. “ఒక వ్యక్తిగా, నటుడిగా నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను నమ్ముతున్నాను. ‘‘సినిమా పరిశ్రమలో పుట్టి, సినిమా సెట్స్‌పై పెరిగాను, ప్రేమ, ప్రశంసలు అందుకుంటున్న చిత్రాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మా నాన్నను ప్రేమించే కోట్లాది మంది అభిమానుల ఎనలేని ప్రేమను, అభిమానుల పట్ల నాన్నకు ఉండే వినయాన్ని ప్రత్యక్షంగా చూశాను. .
“నాకు ఎప్పటినుండో నటుడిని కావాలనే కోరిక ఉంది. తెలుగు ప్రజల ప్రేమ, మద్దతుతో నా కలను సాధించగలిగాను. నా జీవితం ఎప్పుడూ ‘తెరిచిన పుస్తకం’. అందుకే నా పిల్లలు పుట్టినప్పుడు మీ ఆశీస్సులు కోరాను. ఈరోజు నా పిల్లల కోసం మీ ప్రేమ, ఆప్యాయతలను మరోసారి కోరుతున్నా. తండ్రిగా నా ఇద్దరు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్ పరిచయం చేయడం గర్వంగా ఉంది‘‘ అంటూ మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.