టాలీవుడ్ నటుడు నవదీప్ ఒకప్పుడు హీరో.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఈ నటుడు ఈ మధ్య సినిమాలపరంగా కొంచెం స్పీడు తగ్గించినా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు తన జిమ్ ఫొటోలు షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. నవదీస్ సినీ కెరీర్ బాగునప్పటికీ.. పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. పైగా వయసు కూడా 35పైనే. ‘‘ఇంతకీ నవదీప్ పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు’’ కొంతమంది సందేహం కూడా. ఇదే విషయాన్ని నవదీప్ నే అడిగితే.. పోలా అనుకున్నారు ఆయన అభిమానులు.
అతని పెళ్లి గురించి అడుగుతూ మళ్లీ ట్రోల్ చేశారు. ‘‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’’ అని ఒకరు.. ‘‘జుట్టు తెల్లబడుతున్నందున ఎప్పుడు సెటిల్ అవుతారు’’ అంటూ మరొకరు అడిగారు. వీటిపై స్పందిస్తూ ఓ విడియో ను షేర్ చేశాడు నవదీప్. ‘గడ్డం తెల్లగా ఉంటే ట్రిమ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోకూడదు’ అని ఆ వీడియోలో చెప్పాడు. క్లీన్ షేవ్ లుక్, అలాగే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నవదీప్ ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 5 OTT వెర్షన్‌లో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. నవదీప్ ఇంతకుముందు బిగ్ బాస్‌లో భాగమయ్యాడు. అయితే అతను రియాలిటీ షోలో తిరిగి రావడానికి అంగీకరిస్తాడో లేదో చూడాలి. ఈ షోలో పాల్గొనేందుకు అతనికి భారీ మొత్తంలో పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.
Oddhu ra sodhara 🙂 pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022
