Site icon HashtagU Telugu

IT Raids : ఐదు రోజుల తర్వాత ముగిసిన ఐటీ రైడ్స్.. నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు

Income Tax Raids Tollywood Film Producers Film Production Companies Hyderabad Telangana

Income Tax Raids Tollywood Film Producers Film Production Companies Hyderabad Telangana

IT Raids : టాలీవుడ్ సినీ నిర్మాతలు, నిర్మాణ సంస్థలపై ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం అధికారుల రైడ్స్ ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత ఇవాళ తెల్లవారుజామున ముగిశాయి. ఈ రైడ్స్‌లో ఆయా నివాసాలు, కార్యాలయాల నుంచి కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి వేళ సినిమాల వసూళ్లపై ముఖ్యమైన సమాచారాన్ని కూడగట్టారు.

Also Read :Two Women Married : భర్తల టార్చర్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

దిల్ రాజు.. రెండేళ్ల సినిమాల ఆదాయ వ్యయాలపై.. 

గత మంగళవారం రోజు మొదలైన ఐటీ రైడ్స్(IT Raids) ఒకటి, రెండు రోజుల్లోనే ముగుస్తాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అవి శనివారం వరకు కొనసాగాయి. తొలుత మంగళవారం తెల్లవారుజామున  ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ యజమానులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, మ్యాంగో మీడియా సంస్థ నిర్వాహకుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు మొదలయ్యాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ దిల్ రాజుదే. అందుకే దిల్ రాజును శుక్రవారం రోజు జూబ్లీ‌హిల్స్‌లోని ఆయన నివాసం నంచి సాగర్ సొసైటీలో ఉన్న ఎస్వీ క్రియేషన్స్ ఆఫీసుకు ఐటీ అధికారులు తీసుకెళ్లారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను.. ఆ ఆఫీసులో దిల్ రాజు ఎదుటే ఐటీ అధికారులు పరిశీలించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమాలకు సంబంధించిన లాభాలపై దిల్ రాజును ఐటీ అధికారులు ప్రశ్నించారు.  గత రెండేళ్లుగా నిర్మించిన సినిమాల వ్యయం, ఆదాయాలపైనా వారు ఆరా తీశారు. ఆదాయం, పన్ను చెల్లింపుల్లో తేడాలకు సంబంధించి దిల్‌‌రాజు, ఎస్‌‌వీసీ ఆడిటర్‌‌‌‌, అకౌంటెంట్‌‌ స్టేట్‌‌మెంట్స్‌‌ను ఐటీ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలిసింది.

Also Read :YSRCP Vs BJP : వైసీపీ నుంచి మెజార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్తారా? ఏం జరగబోతోంది ?

18 ప్రదేశాలు.. 55 మంది ఐటీ అధికారులు

పుష్ప-2 డైరెక్టర్‌‌‌‌ సుకుమార్‌‌‌‌, ప్రొడ్యూసర్‌‌‌‌ నెక్కంటి శ్రీధర్ ఇళ్లు, కార్యాలయాల్లో కూడా రైడ్స్ జరిగాయి. వాస్తవానికి  శుక్రవారం నాటికే దిల్ రాజు సహా చాలా మంది ఇళ్లల్లో సోదాలు ముగిశాయి. మరికొంతమంది నివాసాల్లో శనివారం తెల్లవారుజాము వరకు రైడ్స్ కొనసాగాయి.  మొత్తం మీద ఐదు రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లోని 18 ప్రదేశాల్లో 55 మంది ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు.