తెలుగు బిగ్ బాస్ (Big Boss) నిర్వాకులకు తెలంగాణ పోలీసులు (Telangana Police) షాక్ ఇచ్చారు. రీసెంట్ గా సీజన్ 7 గ్రాండ్ గా ముగిసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి షో అలరించింది. అలాగే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత గా నిలిచి కోట్లాది మంది తెలుగు అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ప్రశాంత్ (Pallavi Prashanth) ఫై ఉన్న అభిమానం పోగొట్టుకునేలా చేసుకున్నాడు. ఓట్ వేసి గెలిపించిన వారంతా ఇప్పుడు ఛీ అనవసరంగా గెలిపించామని అనుకుంటున్నారు.
బిగ్ బాస్ ఫైనల్ తర్వాత జరిగిన ఘటనలు అందరికి తెలిసిందే. అభిమానం పేరుతో కొంతమంది ప్రభుత్వ ఆస్తులు ధ్వసం చేయడం తో పాటు పలువురి సెలబ్రటీస్ కార్లను ధ్వసం చేసారు. ఈ ఘటన లో A1 గా పల్లవి ప్రశాంత్ ను చేరుస్తు ఆయన్ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలు కు తరలించారు. ఇదే క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. త్వరలో బిగ్ బాస్ నిర్వాహకులను విచారిస్తామని డీసీపీ విజయ్ తెలిపారు. పల్లవి ప్రశాంత్ కావాలనే అక్కడున్న యువకులను రెచ్చగొట్టాడన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పల్లవి ప్రశాంత్‌ను వేరే దారిలో పంపించామన్నారు. పాపులారిటీ కోసం మళ్లీ వచ్చి.. అక్కడి వారిని రెచ్చగొట్టారన్నారు. మరోపక్క శివాజీ సైతం పల్లవి ప్రశాంత్ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడం వెనుక శివాజే కారణం. శివాజీ లేకపోతే ప్రశాంత్ ఎప్పుడో హౌస్ నుండి బయటకు వచ్చేవారు. ఇక ప్రశాంత్ అరెస్ట్ విషయంలో శివాజి స్పందించారు.
చాలా మంది నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు వాడు చట్టప్రకారం బయటికి వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్న తను ఎక్కడికీ పారిపోలేదు అయితే పారిపోయాడని థంబ్‌నెయిల్స్ పెట్టారు అది చూసి చాలా బాధేసింది. ప్రశాంత్ ఎలాంటివాడో నాలుగు నెలలు ఒక హౌజ్‌లో ఉండి చూశా, మంచి కుర్రాడు, వయసు ప్రభావంతో గెలిచాను అన్న ఆనందం మనిషిని డామినేట్ చేయవచ్చని అన్నారు. ఇక ప్రశాంత్ గురించి పదేపదే ప్రతీసారి మాట్లాడాల్సిన అవసరం లేదన్న ఆయన సంఘటన జరిగిన మొదటి గంట నుంచి ఇప్పటివరకు అసలు ఏం జరుగుతుందో ప్రతీ విషయం నాకు తెలుసు, అయితే నేను ప్రతీది నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
Read Also : AP : మీ వైఖరి ఏంటో చెప్పాలంటూ పవన్ కు హరిరామ జోగయ్య సంచలన లేఖ