గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్ (Game Changer ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న పేరు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగింది. దాదాపు మూడేళ్ళ పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ చూసేందుకు మెగా అభిమానులు , సినీ లవర్స్ పోటీ పడుతున్నారు. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే..ప్రభుత్వం అదనపు ఆట తో పాటు టికెట్ ధరలు కూడా పెంచుకునే అవకాశం ఇచ్చి మేకర్స్ ను , అభిమానులను సంతోష పెట్టింది. అయితే షో టైమింగ్స్ పట్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ అంచనాలు ఉన్న సినిమాకు వేళకాని వేళలో ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూనే రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతినివ్వడంపై హైకోర్టు(telangana high court)లో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్‌లు దాఖలయ్యాయి.
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
తెల్లవారుజామున నాలుగు గంటల షోకు అనుమతినివ్వడం, లైసెన్సింగ్ అథారిటీలు కాకుండా హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేయడం, టికెట్ల రేట్ల పెంపునకు అంగీకరించడం సరికాదని ఈ సందర్భంగా పిటిషనర్లు వాదించారు. పుష్ప-2 సినిమా ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. షోల మధ్య తగినంత వ్యవధి లేకపోవడంతో సినిమాకు వచ్చే జనాలను అదుపు చేయడం కష్టంగా మారుతుందన్నారు. వాదనలు విన్న జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రదర్శించే సినిమాకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్తే వారి పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. 16 ఏళ్లలోపు పిల్లలు రాత్రివేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాలని పేర్కొంది. అలాగే రాత్రివేళ భారీగా వచ్చే జనాన్ని అదుపు చేసే విషయంలో పోలీసులపై అదనపు భారం పడుతుందని పేర్కొంది. ప్రదర్శనకు, ప్రదర్శనకు మధ్య 15 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉండటం వల్ల వందలమంది వాహనాలను తీసుకెళ్లడం, వచ్చేవారు పార్క్ చేయడం ఎలా కుదురుతుందని ప్రశ్నించింది. దీనిపై విచారణ నేటికి (శుక్రవారం) వాయిదా పడింది. మరి ఈరోజు తీర్పు ఎలా వస్తుందో చూడాలి .